: పైరసీదారుల భరతం పడుతున్న ‘లయన్’ టీమ్
ఇటీవలి బాలకృష్ణ చిత్రం 'లయన్', రిలీజైన మరుసటి రోజే పైరసీ సీడీలు బయటకు రావడంతో ఆందోళన పడ్డ నిర్మాతలు 'లయన్ టీమ్'ను ఏర్పాటు చేసి పైరసీ జరుగుతోందన్న సమాచారం వచ్చిన చోటల్లా అడ్డుపడుతున్నారు. బెంగళూరులోని ఓ థియేటర్‌లో 'లయన్' చిత్రాన్ని కెమెరాతో చిత్రీకరించడానికి ఓ వ్యక్తి ప్రయత్నించగా, ఈ టీమ్ సకాలంలో చేరుకుని అడ్డుపడింది. కడప జిల్లా, రైల్వే కోడూరులో రవి అనే వ్యక్తి తన ఇంట్లోనే ‘లయన్’ పైరసీ సీడీలు తయారు చేస్తున్నాడన్న సమాచారంతో దాడి చేయగా, అతను తప్పించుకుని పారిపోయినట్టు సమాచారం. ‘లయన్’ సినిమాను పైరసీ చేసే ప్రయత్నాలు సాగనివ్వమనీ, ఇప్పటికే కొంతమంది వ్యక్తులపై నిఘా పెట్టామని ‘లయన్’ నిర్మాత రుద్రపాటి రమణారావు తెలిపారు. 'లయన్' పైరసీపై సమాచారం తెలిస్తే బాలకృష్ణ అభిమానులు వెంటనే స్పందించాలని కోరారు.