: నేనేం తప్పు చేశాను... మీడియాదే తప్పంతా: ఛత్తీస్ గఢ్ ఐఏఎస్ అధికారి అమిత్


దేశంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదయ్యే బస్తర్ ప్రాంతంలో సూటు వేసుకుని కళ్లద్దాలు లేకుండా విధులెలా నిర్వర్తించాలని ఛత్తీస్ గఢ్ ఐఏఎస్ అధికారి అమిత్ కటారియా వాపోతున్నారు. ప్రోటోకాల్ కు విరుద్ధంగా వ్యవహరించి, ప్రధాని పర్యటనలో నల్ల కళ్లద్దాలు, ఫార్మల్ డ్రెస్ ధరించి అమిత్ పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై తొలిసారిగా అమిత్ స్పందిస్తూ, నల్ల కళ్లద్దాలు, ఫార్మల్ డ్రెస్ లో ప్రధానికి షేక్ హ్యాండ్ ఇవ్వడాన్ని సమర్థించుకున్నారు. సూటు ధరించి, 40 డిగ్రీల వేడిలో ఉక్కపోతను అనుభవిస్తూ విధులు నిర్వర్తించడం నావల్ల కాదంటూ సహచరుల వద్ద వ్యాఖ్యానించారు. తానేమీ టీషర్టు, స్లిప్పర్లు ధరించలేదని, కంప్లీట్ ఫార్మల్ వేర్ లో ఉన్నానని అన్న ఆయన, అసలీ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ పట్టించుకోలేదని, ఆయన తనకు 'హలో' చెప్పారని, మీడియానే ఈ వ్యవహారాన్ని వివాదాస్పదం చేసిందని అమిత్ కటారియా విమర్శించారు. ప్రోటోకాల్ ను పాటించనందుకు ఆయనకు ఛత్తీస్ గఢ్ సర్కారు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News