: విప్రోలో ఉద్యోగుల ఎంపిక రోబోల చేతికి!


ఐటీ దిగ్గజం విప్రో టెక్నాలజీ పరంగా మరో ముందడుగు వేసింది. నిర్వహణా వ్యయాలను గణనీయంగా తగ్గించుకునే విధంగా ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుని ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫాంను ప్రారంభించి అంతర్గత కార్యకలాపాలను ఆటోమేట్ చేసిన సంస్థ 'సాఫ్ట్ రోబో'ల సేవలను మరింతగా వినియోగించుకోవాలని భావిస్తోంది. ఫ్రంట్ ఆఫీస్, హెల్ప్ డెస్క్, రిక్రూట్ మెంట్ విభాగాల్లో ఈ రోబోలను నియమించాలని భావిస్తున్నట్టు సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కేఆర్ సంజీవ్ వివరించారు. దీనివల్ల సంస్థ పనితీరు మెరుగుపడడమే కాకుండా, ఖర్చులు తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ 'సాఫ్ట్ రోబో'లను విప్రో ఇన్నోవేషన్ సెంటర్ లో తయారు చేశామని, సుమారు 300 రీసెర్చర్లు, వివిధ విభాగాల్లో డాక్టరేట్లు పొందిన 30 మంది ఔత్సాహికులు ఈ సాంకేతికతను అభివృద్ధి చేసినట్టు తెలిపారు. ఇప్పటికే ఇంటర్నల్ హెల్ప్ డెస్క్ లో ఉంచిన రోబో సరాసరిన 12 వేల రకాల విచారణ ప్రశ్నలు, ఉద్యోగుల ఫిర్యాదులకు సమాధానాలు ఇస్తోందని, 95 శాతం కచ్చితత్వంతో పనిచేస్తోందని వివరించారు. ఇకపై ఉద్యోగ నియామకాల్లో రోబోల సాయం తీసుకోనున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News