: ఎత్తుకు పైఎత్తు... గవర్నర్ సూచనతో ఆదేశాలిచ్చిన ఉద్యోగిని ఊడబెరికిన కేజ్రీవాల్!


ఢిల్లీ చీఫ్ సెక్రటరీ విషయంలో జరుగుతున్న రగడ గురించి అందరికీ తెలిసిందే. ఈ విషయంలో తాజా వివాదం ఏంటంటే, గవర్నర్ చెప్పారని శకుంతలా గామ్లిన్ ను ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ, జీవోను జారీ చేసిన అధికారిని కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ విధుల నుంచి తప్పించింది. కేజ్రీ సర్కారులో ముఖ్య కార్యదర్శి (సేవలు)గా పనిచేస్తున్న అనిందో మజుందార్ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆదేశాల మేరకు గామ్లిన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం అనిందోను విధుల నుంచి తప్పిస్తున్నట్టు పేర్కొంది. కాగా, అనిందో తొలగింపు చెల్లదని, ఆ స్థాయి ర్యాంకు ఉద్యోగులను గవర్నర్ అనుమతి లేకుండా తొలగించడం, మార్చడం కుదరదని నజీబ్ జంగ్ కార్యాలయం ఓ ప్రకటన జారీ చేయడంతో ఈ వివాదం మరింతగా పెరుగుతుందని రాజకీయ పండితులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News