: క్రికెట్ మ్యాచ్ కు వచ్చి అమ్మాయిలను ఏడిపించారట...‘షీ టీమ్’ అదుపులో 9 మంది భావి ఇంజినీర్లు!
నిన్న హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాదు, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన 9 మంది బీటెక్ విద్యార్థులను ‘షీ టీమ్’ అరెస్ట్ చేసింది. సొంత నగరంలో జరుగుతున్న మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసి ఆస్వాదిద్దామని స్టేడియానికి వచ్చిన అమ్మాయిలను ఈ 9 మంది భావి ఇంజినీర్లు ఏడిపించారట. పోకిరి చేష్టలతో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించారట. బాధిత యువతుల నుంచి ఫిర్యాదు అందుకున్న షీ టీమ్ పోలీసులు, వెకిలి చేష్టలకు పాల్పడ్డ 9 మంది బీటెక్ విద్యార్థులను అరెస్ట్ చేశారు.