: నందికొట్కూరు మునిసిపాలిటీలో ముసలం... బైరెడ్డి పంచన చేరిన వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు


కర్నూలు జిల్లా నందికొట్కూరు మునిసిపాలిటీ పాలకవర్గంపై అయోమయ పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో సత్తా చాటిన వైసీపీ మునిసిపాలిటీపైనా పట్టు బిగించింది. అయితే స్థానికంగా బలమైన నేతగా ఉన్న రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) అధ్యక్షుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి కూడా కొన్ని స్థానాలను గెలుచుకున్నారు. ఈ క్రమంలో మొదటి నుంచి పాలకవర్గంపై సందిగ్ధావస్థే నెలకొంది. ఈ క్రమంలో వైసీపీ నేతలపైనే కాక టీడీపీ నేతల వైఖరిపైనా ఇరు పార్టీలకు చెందిన మునిసిపల్ కౌన్సిలర్లు భగ్గుమన్నారు. ఇరుపార్టీలకు చెందిన పది మంది కౌన్సిలర్లు బైరెడ్డి పంచన చేరిపోయారు. పాలకవర్గం ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని వారు బైరెడ్డి ముందు ప్రతిపాదన పెట్టారు. బైరెడ్డి మద్దతు కోరిన పది మంది కౌన్సిలర్లలో ఏడుగురు వైసీపీకి చెందిన వారు కాగా, ముగ్గురు టీడీపీ సభ్యులున్నారు.

  • Loading...

More Telugu News