: ‘తానా’ సభలకు రామ్ గోపాల్ వర్మ... డెట్రాయిట్ లో చురుగ్గా ఏర్పాట్లు


తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) 20వ మహాసభలు జూలై 2, 3, 4 తేదీల్లో అమెరికా నగరం డెట్రాయిట్ లో జరగనున్నాయి. ఇంకా నెలకు పైగా సమయమున్నప్పటికీ ప్రస్తుతం చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 60 మందికి పైగా కార్యకర్తలు ఏర్పాట్లలో పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది వేడుకలను తెలుగుదనం ఉట్టిపడేలా నిర్వహించేందుకు తానా కార్యవర్గం నిర్ణయించింది. ఈ క్రమంలో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులకు తానా ఆహ్వానాలు పంపింది. బాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ప్రముఖ సాహితీవేత్త సిరివెన్నెల సీతారామశాస్త్రి, టాలీవుడ్ నటులు అల్లరి నరేశ్, శివాజీ, రవిబాబు, శివారెడ్డి, బుల్లితెర యాంకర్లు సుమ, ఝాన్సీ తదితరులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ఈ దఫా సభలను మునుపటి సభలకు విభిన్నంగా నిర్వహించనున్నామని తానా సాంస్కృతిక విభాగం చైర్మన్ లీలా ప్రసాద్ తెలిపారు.

  • Loading...

More Telugu News