: జైలుకెళతానేమోనన్న భయం జగన్ ను వణికిస్తోంది: ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మానసిక స్థితి సరిగా లేదని ఏపీ డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా జగన్ పై చినరాజప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్రమాస్తుల కేసులో జైలుకెళతానేమోనన్న భయం జగన్ ను వెంటాడుతోందని ఆయన అన్నారు. ఈ కారణంగానే జగన్ నిత్యం వణికిపోతున్నారని, నిలకడ లేని వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. అసలు టీడీపీపై విమర్శలు చేసే అర్హత జగన్ కు లేదని కూడా చినరాజప్ప అన్నారు.