: కోల్ కతాలో అవినీతి తిమింగలం... రూ.5 లక్షల లంచంతో పట్టుబడ్డ సేవాపన్ను కమిషనర్


పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో సీబీఐ అధికారుల వలకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. ఓ వ్యక్తి నుంచి రూ.5 లక్షల మేర లంచం తీసుకుంటూ ఆ రాష్ట్ర సేవా పన్నుల(సర్వీస్ ట్యాక్స్) శాఖ కమిషనర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. బాధితుల నుంచి ఫిర్యాదునందుకున్న సీబీఐ అధికారులు పక్కాగా రచించిన ప్లాన్ కు కమిషనర్ దొరికిపోయాడు. కమిషనర్ తో పాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో ముగ్గురు వ్యక్తులను కూడా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News