: పంజాబ్ బాటలోనే చెన్నై బ్యాట్స్ మెన్... రెండు ఓవర్లలో రెండు వికెట్లు డౌన్
పంజాబ్ బ్యాట్స్ మెన్ ను చెన్నై బౌలర్లు ముప్పు తిప్పలు పెట్టగా, పంజాబ్ బౌలర్లు కూడా చెన్నై బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపిస్తున్నారు. 131 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ లో చెన్నై ఓపెనర్ మైక్ హస్సీ (1), రెండో ఓవర్ లో బ్రెండన్ మెకల్లమ్ (6)లు ఔటయ్యారు. జట్టు స్కోరు 2 పరుగుల వద్ద హస్సీ ఔట్ కాగా, 10 పరుగుల వద్ద మెకల్లమ్ కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డూప్లెసిస్ (13), సురేశ్ రైనా (19) నిలకడగా ఆడుతున్నారు. ఐదు ఓవర్లు ముగిసేసరికి చెన్నై రెండు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది.