: తప్పుడు హామీలతో చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు: వైఎస్ జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో తప్పుడు హామీలు గుప్పించిన చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర కొనసాగిస్తున్న జగన్ కొద్దిసేపటి క్రితం ఉజ్జహాల్ లో డ్వాక్రా మహిళలు, రైతులతో ముఖాముఖి నిర్వహించారు. చంద్రబాబు సర్కారు ధోరణితో పింఛన్ల కోసం పేదలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు వాగ్దానాలను నమ్మి తాము మోసపోయామని డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని జగన్ అన్నారు.