: బెంగాల్, బీహార్ లలో భూకంపం... కోల్ కతా, సిలిగురిల్లో భూ ప్రకంపనలు


ఉత్తర భారతాన్ని భూకంప భూతం వీడలేదు. ఇప్పటికే రెండు పర్యాయాలు చోటుచేసుకున్న భూకంపాల కారణంగా వంద మంది దాకా ప్రాణాలు కోల్పోగా, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. తాజాగా కొద్దిసేపటి క్రితం పశ్చిమ బెంగాల్, బీహార్ లలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాతో పాటు సిలిగురిలో భూమి కంపించిపోయింది. భూ ప్రకంపనలతో భయాందోళనలకు గురైన జనం ఇళ్లల్లో నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ భూకంపానికి సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News