: ప్రేమించానని చెప్పి, గర్భవతిని చేసి నోట్లో యాసిడ్ పోసిన దుర్మార్గుడు
ఓ యువతిని మాయమాటలతో లోబరచుకున్నాడో ప్రబుద్ధుడు. ప్రేమించానని చెప్పి గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోమని నిలదీస్తే నోట్లో యాసిడ్ పోశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాదు పరిధిలోని నేరేడుమెట్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టీఆర్‌ఎస్ కార్యకర్త నల్లా నరేంద్ర ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. యువతి గర్భం దాల్చడంతో, గర్భస్రావం చేసేందుకు ప్రియురాలి నోట్లో యాసిడ్ పోశాడు. దీంతో ఆ యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నల్లా నరేంద్ర పరారీలో ఉన్నాడని, అతని కోసం వెతుకుతున్నామని తెలిపారు.