: అనుకూలమైన అధికారిని నియమించుకుంటే తప్పేంటి?: ఏపీ మంత్రి అయ్యన్న వితండవాదం


విశాఖ జిల్లాలో రెవెన్యూ అధికారుల బదిలీల వ్యవహారం వివాదాస్పదమైంది. ఆర్డీఓ స్థాయి అధికారి బదిలీకి సంబంధించి ఏపీ కేబినెట్ లోని ఇద్దరు మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస్ ల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. దీంతో ఈ వివాదానికి తెరదించేందుకు ఏకంగా సీఎం నారా చంద్రబాబునాయుడు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తాజాగా ఓ ఆసక్తికర వాదనను తెరపైకి తెచ్చారు. అనుకూలమైన అధికారులను నియమించుకుంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న సమయంలో అసలు అధికారుల బదిలీలపైనే దృష్టి సారించలేదు కదా, ఇప్పుడు ఇష్టమైన అధికారులను నియమించుకుంటే వచ్చిన ఇబ్బందేమిటని ఆయన ఒకింత నిలదీత ధోరణిలోనే వ్యాఖ్యలు చేశారు. ఇక గంటాతో తనకు విభేదాలపై స్పందించిన అయ్యన్న, అవన్నీ మీడియా కల్పిత కథనాలేనని కొట్టిపారేశారు.

  • Loading...

More Telugu News