: మొబైల్ ఫోన్ కోసం ఆర్డరిస్తే... ‘రాయి’ వచ్చింది!


నిజమేనండోయ్, ఘజియాబాద్ కు చెందిన బసంత్ శర్మ మొబైల్ కోసం ఆర్డరిస్తే, ఈ-టెయిలింగ్ సంస్థ అతడి చేతిలో ‘రాయి’ పెట్టింది. దీంతో షాక్ తిన్న బసంత్ శర్మ ఇందేంటని నిలదీస్తే, తనకేమీ తెలియదని సదరు ఈ-టెయిలింగ్ సంస్థ డెలివరీ బాయి చెప్పేశాడు. అంతేకాక పార్సిల్ కోసం బసంత్ చెల్లించిన డబ్బు కూడా తిరిగి ఇవ్వడం కుదరదని కూడా బాయ్ చెప్పాడట. రెట్టించి అడగడంతో ఈ-కామర్స్ సంస్థ ప్రతినిధితో మాట్లాడిన డెలివరీ బాయ్, డబ్బును బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని బుకాయించి తుర్రుమన్నాడు. ఆశ్చర్యంగా ఉన్నా, ఈ తరహా ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ చోటుచేసుకుంటున్నాయి. మొబైల్ ఫోన్ కోసం ఆర్డరిచ్చిన బసంత్, పార్సిల్ రాగానే డెలివరీ బాయ్ ముందే దానిని విప్పాడు. పార్సిల్ డబ్బాలో మొబైల్ కు బదులు, రాయి ఉండటంతో బసంత్ షాక్ తిన్నాడు. తన డబ్బులు తిరిగివ్వకపోవడం, సరైన సమాధానం చెప్పని సదరు ఈ-టెయిలింగ్ సంస్థపై బసంత్ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News