: హీరో మోటోను అధిగమించిన ఐచర్


దేశంలో అత్యధికంగా ద్విచక్ర వాహనాలను విక్రయిస్తున్న సంస్థ హీరో హోండాను, కమర్షియల్ వాహన సంస్థ ఐచర్ అధిగమించింది. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? గత కొంత కాలంగా స్థిరమైన ప్రగతితో, మంచి లాభాలతో దూసుకువచ్చిన ఐచర్ మార్కెట్ కాపిటలైజేషన్ పరంగా హీరో మోటోను దాటేసింది. వాస్తవానికి ఐచర్ విక్రయించే వాహనాల సంఖ్యతో పోలిస్తే హీరో మోటో 15 రెట్ల అధిక సంఖ్యలో వాహనాలను విక్రయిస్తుంది. శుక్రవారం నాటి స్టాక్ మార్కెట్ సెషన్లో ఐచర్ మార్కెట్ కాప్ ఆల్ టైం రికార్డు స్థాయిలో రూ. 50,709 కోట్ల రూపాయలకు చేరగా, హీరో మార్కెట్ కాప్ రూ. 50,355 కోట్ల వద్ద కొనసాగింది. ఈ సంవత్సరం తొలి స్టాక్ మార్కెట్ సెషన్ నాడు హీరో మార్కెట్ కాప్ రూ. 62,053 కోట్ల వద్ద ఉండగా, అది తగ్గుతూ వచ్చింది. కాగా, ఐచర్ చూపిన అద్భుత పనితీరుతో సంస్థ ప్రమోటర్ల వాటా రూ. 27,880 కోట్లకు చేరగా, హీరోలో ప్రమోటర్లుగా ఉన్న ముంజాల్ కుటుంబ వాటా 17,443 కోట్లకు తగ్గింది. రాయల్ ఎన్ ఫీల్డ్ బైకును ఐచర్ తయారు చేసి విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News