: విద్యార్థినితో ఆసభ్యకర రీతిలో దొరికిపోయిన ప్రొఫెసర్... చితకబాదిన విద్యార్థులు
అలహాబాద్ యూనివర్శిటీ సంగీత విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకరు తన విద్యార్థినితో అసభ్య భంగిమలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. గత రాత్రి ఈ ఘటన జరుగగా, ఆయన ఇంట్లోకి దూసుకెళ్లిన కొందరు విద్యార్థులు ప్రొఫెసర్ ను బయటకు లాగి చితకబాదారు. కొట్టుకుంటూ సమీపంలోని పోలీసు స్టేషనుకు తీసుకెళ్లారు. అంతకుముందు రెండు రోజుల క్రితం మరో విద్యార్థినితో ఈ ప్రొఫెసర్ ఇటువంటి స్థితిలోనే కనిపించినట్టు ఆరోపణలు వచ్చాయి. కాగా, తనను ఇంటికి పిలిచి లైంగికంగా వేధించాడని తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థిని, ఆపై మాట మార్చింది. తన తల్లిదండ్రులు వచ్చిన తరువాత అటువంటిదేమీ జరగలేదని చెప్పింది. కాగా, యూనివర్శిటీ అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.