: తెలంగాణ ప్రజలను రూ. 500 కోట్ల మేర బాదనున్న ఆర్టీసీ
ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం 44 శాతం ఫిట్ మెంట్ ప్రకటించిన సమయంలో... ఆర్టీసీ ఛార్జీలను కొంతమేర పెంచక తప్పదని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడే స్పష్టం చేశారు. ఈ క్రమంలో, 15 శాతం మేర ఛార్జీలు పెంచాల్సి ఉంటుందని ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే, తెలంగాణలోని సామాన్య ప్రజానీకంపై రూ. 500 కోట్ల మేర భారం పడనుందని అంచనా. తాజాగా డీజిల్ ధరలు కూడా పెరగడంతో... ఛార్జీల పెంపు తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరిగిన అనంతరం, ఎప్పుడైనా ఛార్జీలు పెంచవచ్చని సమాచారం.