: అత్యాచారం విధించిన శిక్ష...42 ఏళ్లయినా కోమాలోంచి బయటికి రాలేదు


42 ఏళ్ల క్రితం జరిగిన అత్యాచారం ఓ నిండు జీవితాన్ని నాశనం చేసింది. అరుణా షాన్ బాగ్ (68) అనే మహిళ 26 ఏళ్ల వయసులో ఉండగా ముంబైలోని కేవీఎం ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వర్తించేది. ఆ సమయంలో ఆమెపై వార్డు బాయ్ సోహన్ లాల్ వాల్మీకి ఆమెపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేశాడు. అంతవరకు తనతో మంచివాడుగా ప్రవర్తించిన ఆ వ్యక్తి దారుణానికి పాల్పడడంతో షాక్ తిన్న ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ఏ ఆసుపత్రిలో అయితే విధులు నిర్వర్తించిందో, అదే ఆసుపత్రిలో బెడ్ పై 42 ఏళ్లుగా జీవచ్ఛవంలా పడి ఉంది. ఆమె దయనీయ స్థితిలో ఉందని, ఆవిడకు కారుణ్యమరణం ఇవ్వాలని కొన్ని సంఘాలు వాదిస్తుండగా, కేవీఎం ఆసుపత్రి యాజమాన్యం మాత్రం ఆ అవసరం లేదని, ఆమె జీవించినన్నాళ్లు జీవిస్తారని చెబుతోంది.

  • Loading...

More Telugu News