: 'మినీ మోదీ' అంటే విమర్శా? లేక పొగడ్తా?


కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిన్నటి తన పాదయాత్రలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి 'మినీ మోదీ'లా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇంతకీ, మినీ మోదీ అంటే విమర్శా? లేక పొగడ్తా? అని టీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. గత కొంత కాలంగా మోదీతో సఖ్యత కోరుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ ఆయన్ను, కేంద్ర విధానాలను వెనకేసుకొస్తూ, అవకాశం చిక్కినప్పుడల్లా పొగడుతున్న నేపథ్యంలో, మినీ మోదీ అంటే తప్పేంటని కొందరు అంటున్నారు. అయితే, మంత్రి హరీష్ రావు మాత్రం రాహుల్ గాంధీ అలా అనడం తగదని, రైతు యాత్రలు అంటూ ఆయన కొత్త నాటకం మొదలు పెట్టడం విడ్డూరంగా ఉందని, అసలు కాంగ్రెస్ వల్లే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. రాహుల్ ఎన్ని యాత్రలు చేసినా ప్రయోజనం ఉండదని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News