: భార్యపై అఘాయిత్యాన్ని అడ్డుకున్న భర్తకు కత్తిపోట్లు


అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చిలమత్తూరు మండలం యాగ్నిశెట్టిపల్లిలోని ఓ ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. వారిని దంపతులు అడ్డుకోవడంతో భార్యపై అత్యాచార యత్నం చేశారు. వారి ప్రయత్నాన్ని భర్త అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహించిన దొంగలు అతనిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యారు. దొంగల దాడిలో తీవ్రంగా గాయపడిన భర్తను స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News