: 'స్వచ్ఛ హైదరాబాదు'కు సర్వం సిద్ధం


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని స్వచ్ఛ హైదరాబాదుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నేటి మధ్యాహ్నం ప్రారంభం కానున్న స్వచ్ఛ హైదరాబాదు కార్యక్రమాన్ని గవర్నర్ నరసింహన్ ప్రారంభించనున్నారు. హైదరాబాదులో పరిశుభ్రత లక్ష్యంగా మే 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీని కోసం తెలంగాణ ప్రభుత్వం 200 కోట్ల రూపాయలను కేటాయించడం విశేషం. ఈ విషయంలో ఇప్పటికే హైదరాబాదును నాలుగు జోన్లుగా విభజించిన ప్రభుత్వం ... ఒక్కో జోన్ కు గవర్నర్, సీఎం, హైదరాబాదు పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి, సైబరాబాదు కమిషనర్ సీవీ ఆనంద్ లను గౌరవాధ్యక్షులుగా నియమించింది. వీరి ఆధ్వర్యంలో 'స్వచ్ఛ హైదరాబాదు' కార్యక్రమం జరుగుతుంది. నేటి నుంచి సరిగ్గా ఐదు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమ లక్ష్యం హైదరాబాదును పరిశుభ్రంగా తీర్చిదిద్దడం. దీనికి బీజేపీ నేతలు కూడా మద్దతు పలుకుతున్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News