: ఏపీలో ఫలితాల వెల్లువ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫలితాల జాతర జరగనుంది. ఈ నెల 20వ తేదీన 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేయనుండగా, 21వ తేదీన ఎంసెట్ పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నారు. అనంతరం ఈ నెల 28న ఐసెట్ పరీక్ష ఫలితాలు వెల్లడించనున్నారు. అనంతరం జూన్ ఒకటిన డీఎస్సీ పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నారు. దీంతో పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుంటుందని విద్యాశాఖ స్పష్టం చేస్తోంది. వరుసగా పరీక్షల ఫలితాలు వెల్లడించడంతో రానున్న విద్యాసంవత్సరం అనుకున్న సమయానికే ప్రారంభం కానుంది. అయితే సీబీఎస్ఈ ఫలితాలు వచ్చాకే ఎంసెట్ అసలు ర్యాంక్స్ విడుదల చేస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News