: ఉప్పల్ లో భారీ వర్షం...మ్యాచ్ ఆలస్యం...మ్యాచ్ చూసేందుకు బయల్దేరిన కేసీఆర్
హైదరాబాదులోని ఉప్పల్ పరిసరాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ సీజన్-8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాదు జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. వర్షానికి తడవకుండా పిచ్ పై కవర్స్ కప్పి ఉంచారు. వర్షం కారణంగా మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది. కాగా, మ్యాచ్ చూసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉప్పల్ బయల్దేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో వర్షం కురవడంతో ఉప్పల్ రోడ్లపై సాధారణ ప్రయాణికులు, క్రికెట్ అభిమానులతో ట్రాఫిక్ జాం అయింది.