: నల్లధనంపై పోరాటానికి భారత్ కు సహకరిస్తాం: స్విస్
నల్లధనం నియంత్రణపై భారత్ చేస్తున్న పోరాటానికి సహకరిస్తామని స్విట్జర్లాండ్ ప్రకటించింది. స్విస్ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమాచారం అందజేయాలని భారత్ సహా మరికొన్ని దేశాలు విజ్ఞప్తులు చేస్తున్నాయని స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవహారాల మంత్రి జొహన్నా అమ్మాన్ తెలిపారు. ఈ ఖాతాలకు సంబంధించిన సమాచారం అందజేసే చట్టంలో మార్పులపై త్వరలోనే తమ పార్లమెంటు సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని జొహన్నా తెలిపారు. పలు దేశాలు చేస్తున్న స్విస్ ఖాతాల అంశం ప్రతిపాదనను రానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నామని ఆయన చెప్పారు.