: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు


ఈ రోజు భారతీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 118 పాయింట్ల లాభంతో 27,324కు చేరుకోగా, నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 8,262కు చేరింది. అలోక్ ఇండస్ట్రీస్, జుబిలెంట్ ఫుడ్ వర్క్స్, నాట్కో ఫార్మా, షిప్పింగ్ కార్పొరేషన్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. హెచ్ డీఐఎల్, పుంజ్ లాయిడ్, ఎన్ సీసీ, ఎడెల్ వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డీబీ కార్పొరేషన్ లిమిటెడ్ లు నష్టాలను మూటగట్టుకున్నాయి. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ. 63.52గా ఉంది.

  • Loading...

More Telugu News