: సినిమా ఉత్సవాన్ని ఫ్యాషన్ షోలా తయారు చేశారు: కేన్స్ పై షబానా వ్యాఖ్యలు


కేన్స్ చలన చిత్రోత్సవాలను మీడియా, సినిమా నటులు కలసి ఫ్యాషన్ షోలా తయారు చేస్తున్నారని ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేన్స్ చలన చిత్రోత్సవంలో సినీ నటీమణుల చిత్ర విచిత్ర వేషధారణ, హొయలు పోవడం, వాటిని ఫోటోలు తీసేందుకు, వాటిని ప్రసారం చేసేందుకు మీడియా పోటీపడడంపై ఆమె ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. కేన్స్ చలన చిత్రోత్సవం ఎంతో గొప్ప కార్యక్రమమని, దానిని ఫ్యాషన్ షోగా మార్చవద్దని హితవు పలికారు. దీనిని గౌరవించాలని ఆమె ట్వీట్ చేశారు. కాగా, కేన్స్ లో ప్రారంభమైన 68వ చలనచిత్రోత్సవంలో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ పాల్గొని సందడి చేయగా, భర్తతో పాటు ఐశ్వర్యరాయ్, సోనమ్ కపూర్ కూడా పాల్గోనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News