: వేడి రక్తం ఉన్న చేపను గుర్తించిన శాస్త్రవేత్తలు


ప్రపంచంలో పూర్తి వేడి రక్తం కలిగి ఉన్న చేపను అమెరికా శాస్త్రవేత్తలు కాలిఫోర్నియాలోని సముద్ర తీరంలో గుర్తించారు. సాధారణంగా చేపల్లో రక్తం చల్లగా ఉంటుంది. దీనికి భిన్నంగా, ఒపాహ్ లేదా మూన్ ఫిష్ గా పిలిచే ఈ చేప ఇతర జంతువుల మాదిరిగా వేడి రక్తం కలిగి ఉందని వారు చెప్పారు. కారు టైరు సైజ్ లో ఉండే ఈ చేప సముద్రం అడుగున అతిచల్లని ప్రదేశాల్లో సురక్షితంగా ఉండేందుకు వీలుగా మొప్పల ద్వారా రక్తంలో వేడిని పుట్టిస్తుందట. అలా పుట్టించిన వేడి రక్తాన్ని శరీరమంతా సరఫరా చేసుకుంటుందట.

  • Loading...

More Telugu News