: సన్నీ లియోన్ పై కేసు నమోదు
పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ కు దిగుమతైన అందాల భామ సన్నీ లియోన్ పై కేసు నమోదైంది. తన వెబ్ సైట్ (Sunneyleone.com) లో అభ్యంతరకర మెటీరియల్ పోస్టు చేసిందంటూ ఈ ఇండో-కెనడియన్ బ్యూటీపై పూణే డోంబీవాలి పోలీసులు కేసు బుక్ చేశారు. అంజలి పాలన్ అనే గృహిణి ఇంటర్నెట్లో సన్నీ లియోన్ కు సంబంధించి పలు అభ్యంతరక సీన్లు, పోస్టులు కనిపిస్తున్నాయని, వాటిలో కొన్ని సన్నీ లియోన్ స్వయంగా పోస్టు చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి పోస్టులు ప్రజల మనసులను కలుషితం చేస్తాయని, ముఖ్యంగా, పిల్లలపై పెను ప్రభావాన్ని చూపుతాయని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంజలి ఫిర్యాదును స్వీకరించిన డోంబీవాలి పోలీసులు కేసును సైబర్ క్రైమ్ సెల్ కు బదిలీ చేశారు.