: నల్ల కళ్లజోడు పెట్టుకుని మోదీకి షేక్ హ్యాండ్ ఇచ్చిన కలెక్టర్ కు నోటీసులు


భారత ప్రధాని మోదీకి షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో నల్ల కళ్లజోడు పెట్టుకున్నందుకు నోటీసులు అందుకున్నారు జిల్లా కలెక్టర్ అమిత్ కటారియా. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లా కలెక్టర్ గా ఆయన పనిచేస్తున్నారు. ఇటీవల మోదీ నక్సల్స్ ప్రభావిత బస్తర్ జిల్లాలో భారీ బహిరంగసభలో పాల్గొని ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రూ. 24 వేల కోట్ల అభివృద్ధి పనులను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన మోదీకి కలెక్టర్ కటారియా షేక్ హ్యాండ్ ఇచ్చారు. నీలిరంగు చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించి హ్యాండ్ సమ్ గా ఉన్నారు కటారియా. ఆయన చేసిన పొరపాటు ఏమిటంటే అదే సమయంలో నల్లకళ్లజోడు ధరించడమే. ఇదే ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. నల్ల కళ్లజోడు ధరించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ఈ రోజు ఆయనకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అసలు విషయం ఏమిటంటే... రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి వీవీఐపీలను కలిసినప్పుడు సివిల్ సర్వీస్ అధికారులెవరూ కూడా నల్ల కళ్లజోడు ధరించరాదనేది ప్రొటోకాల్ నిబంధన. ఆ నియమాన్ని ఉల్లంఘించినందుకు కలెక్టర్ కటారియా నోటీసులు అందుకున్నారు.

  • Loading...

More Telugu News