: అమెరికా హెలికాప్టర్ కూలిపోయింది... శకలాలను గుర్తించిన నేపాల్ సైన్యం


నేపాల్ లో సహాయచర్యల్లో పాల్గొన్న అమెరికా హెలికాప్టర్ కొన్ని రోజుల క్రితం ఆచూకీ లేకుండాపోయిన సంగతి తెలిసిందే. ఆ హెలికాప్టర్ కోసం తీవ్రంగా గాలింపు జరిపారు. ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్న నేపాల్ సైన్యం ఆ యూఎస్ చాపర్ శకలాలను చైనా సరిహద్దు ప్రాంతంలో పర్వతాల్లో కనుగొంది. ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశాలు లేవని మేజర్ జనరల్ బినోజ్ బాస్నెట్ తెలిపారు. మెరైన్ లైట్ అటాక్ హెలికాప్టర్ స్వాడ్రన్-469కు చెందిన ఈ చాపర్ లో ఆరుగురు అమెరికా మెరైన్లు, ఇద్దరు నేపాల్ సైనికులు ఉన్నారు. భూకంప బాధితులకు ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు తరలిస్తుండగా హెలికాప్టర్ కనిపించకుండా పోయింది. ఇంధన సమస్య గురించి చాపర్ సిబ్బంది మాట్లాడుతుండగా, రాడార్ తో సంబంధాలు తెగిపోయాయి.

  • Loading...

More Telugu News