: నద్దా బిజీగా ఉన్నారట... అందుకే ఎయిమ్స్ శంకుస్థాపన వాయిదా: ఏపీ మంత్రి ప్రత్తిపాటి


గుంటూరు జిల్లాలో అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) శంకుస్థాపన వాయిదా పడింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నద్దా బిజీగా ఉన్న కారణంగానే ఎయిమ్స్ శంకుస్థాపన వాయిదా పడిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొద్దిసేపటి క్రితం పేర్కొన్నారు. ఎయిమ్స్ కు భూముల కొరత నేపథ్యంలోనే ఆ సంస్థ శంకుస్థాపన వాయిదా పడిందన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ప్రత్తిపాటి వివరణ ఇచ్చారు. కేంద్ర మంత్రి బిజీ షెడ్యూల్ కారణంగానే ముందుగా అనుకున్న ప్రకారం ఎయిమ్స్ శంకుస్థాపన జరగలేదని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పర్యటనకు సంబంధించి స్పష్టమైన సమాచారం అందిన తర్వాత ఎయిమ్స్ శంకుస్థాపన తేదీలను ఖరారు చేస్తామని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News