: బెజవాడలో కారు బీభత్సం... అదుపు తప్పి ఇళ్లల్లోకి దూసుకెళ్లిన వైనం
విజయవాడలో ఓ కారు బీభత్సం సృష్టించింది. నగరంలోని బెజ్జోనిపేటలో అదుపు తప్పిన కారు రోడ్డుకు ఆనుకుని ఉన్న ఇళ్లలోకి దూసుకెళ్లింది. నేటి ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి దారి తీసిన కారణాలు తెలియరాలేదు.