: ఏపీకి ప్రత్యేక హోదాను కర్ణాటక సీఎం అడ్డుకుంటున్నారు: కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు


ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించడంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణిని అవలంబిస్తోంది. ఈ విషయంలో మోదీ సర్కారు వైఖరిపై ఏపీకి చెందిన ఆ పార్టీ నేతలతో పాటు ప్రతిపక్షాలు, మిత్ర పక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి గల కారణాలకు సంబంధించి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోకగజపతిరాజు కొత్త కోణాన్ని తెరపైకి తెచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లాంటి కొంతమంది కాంగ్రెస్ నేతలు ఏపీకి ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చిన కాంగ్రెస్ నేతలు, తాజాగా ఏపీకి ప్రత్యేక హోదాను అడ్డుకుంటూ రాష్ట్ర అభివృద్ధి నిరోధకులుగా పనిచేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు.

  • Loading...

More Telugu News