: సునంద పుష్కర్ కేసులో సాక్షులకు లై డిటెక్టర్ పరీక్షలు


కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో సాక్షులు లై డిటెక్టర్ పరీక్షలను ఎదుర్కోబోతున్నారు. శశిథరూర్ మంత్రిగా ఉండగానే ఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్ లో సునంద పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. సంచలనం రేపిన ఈ కేసు దర్యాప్తు ఇప్పటికే పలు కీలక మలుపులు తిరిగింది. ఈ కేసులో ప్రధాన సాక్షులుగా ఉన్న థరూర్ వ్యక్తిగత సహాయకుడు నారాయణ్ సింగ్, డ్రైవర్ భజరంగి, స్నేహితుడు సంజయ్ ధావన్ లు దర్యాప్తునకు సహకరించడం లేదని పోలీసులు ఆరోపిస్తున్నారు. కేసులో కీలక నిజాలు తెలిసిన వారు ముగ్గురు విచారణలో సదరు నిజాలు వెల్లడించడం లేదని పోలీసులు చెబుతున్నారు. సదరు ముగ్గురు సాక్షులు నోరు విప్పితేనే కేసు కొలిక్కి వస్తుందని వాదిస్తున్న పోలీసులు వారికి సత్య శోధన పరీక్షలు చేసేందుకు అనుమతించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 20న జరగనున్న విచారణ సందర్భంగా దీనిపై కోర్టు తన నిర్ణయం వెలువరించనుంది.

  • Loading...

More Telugu News