: కొరిటికల్ బయలుదేరిన రాహుల్ గాంధీ... మరికాసేపట్లో పాదయాత్ర ప్రారంభం


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదిలాబాదు జిల్లాలో చేపట్టనున్న రైతు భరోసా యాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. కొద్దిసేపటి క్రితం ఆయన నిర్మల్ లోని హోటల్ మయూర ఇన్ నుంచి జిల్లాలోని కొరిటికల్ గ్రామానికి కారులో బయలుదేరారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యల పరంపర నేపథ్యంలో అన్నదాతల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు రాహుల్ ఈ యాత్రను చేపడుతున్నారు. కొరిటికల్ గ్రామం నుంచి ప్రారంభమవుతున్న ఈ యాత్ర ఐదు గ్రామాల మీదుగా 15 కిలో మీటర్ల మేర కొనసాగనుంది. దారి పొడవునా రాహుల్ గాంధీ రైతులను పరామర్శిస్తూ, రైతులకు భరోసానిస్తూ యాత్రను కొనసాగించనున్నారు. రాహుల్ రాకతో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంతో ఉరకలేస్తున్నాయి. నిర్మల్ తో పాటు యాత్ర సాగనున్న ప్రాంతాలకు పార్టీ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

  • Loading...

More Telugu News