: అమెరికా నుంచి తిరిగొచ్చిన నారా లోకేశ్...శంషాబాదులో టీఎన్ఎస్ఎఫ్ ఘన స్వాగతం


ఏపీకి పెట్టుబడులను రాబట్టేందుకు అమెరికా పర్యటనకు వెళ్లిన టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేశ్ తన పర్యటనను ముగించుకుని కొద్దిసేపటి క్రితం హైదరాబాదు, శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. ఈ నెల 3న అమెరికా వెళ్లిన ఆయన అక్కడి తెలుగు ప్రజలతో పాటు ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామానూ కలిశారు. పలువురు పారిశ్రామికవేత్తలతో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లను కలుసుకున్న లోకేశ్, మంచి ఫలితాలనే రాబట్టారు. స్మార్ట్ విలేజ్ పై లోకేశ్ చేసిన ప్రసంగం అక్కడి ఎన్నారైలను బాగానే ఆకట్టుకుంది. లోకేశ్ ప్రసంగంతో ఏపీలో 2,400లకు పైగా గ్రామాలను దత్తత తీసుకునేందుకు ఎన్నారైలు ముందుకు వచ్చారు. దాదాపు పది రోజులకు పైగా ఆయన అమెరికాలో పర్యటించి నిన్న అక్కడి నుంచి బయలుదేరి కొద్దిసేపటి క్రితం శంషాబాదు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ విద్యార్థి విభాగం టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

  • Loading...

More Telugu News