: గెస్ట్ హౌస్ పై దాడి మా పనే: తాలిబన్లు


ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో ఈ ఉదయం గెస్ట్ హౌస్ పై దాడి చేసింది తామేనని తాలిబన్లు ప్రకటించుకున్నారు. పూర్తి బాధ్యత తమదేనని తాలిబన్ గ్రూపు ఓ ప్రకటనలో పేర్కొంది. అమెరికా, దాని తొత్తులు ఆఫ్ఘన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నందుకు వ్యతిరేకంగానే ఈ దాడికి పాల్పడ్డామని తాలిబన్ అధికార ప్రతినిధి బాజిహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు. కాగా, ఉదయం జరిగిన దాడిలో పలువురు భారతీయులు కూడా మరణించిన సంగతి తెలిసిందే. భారత రాయబారిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్టు కథనాలు వెలువడ్డాయి. అయితే, వాటిపై తాలిబన్ సంస్థ స్పష్టతనివ్వలేదు.

  • Loading...

More Telugu News