: సైనిక తిరుగుబాటుతో ఘర్షణలు...అజ్ఞాతంలో అధ్యక్షుడు


సైన్యం తిరుగుబావుటా ఎగురవేయడంతో బురుండీ వీధుల్లో సైన్యం, అధ్యక్షుడి మద్దతు వర్గాలు ఘర్షణకు దిగుతున్నాయి. బురుండీ అధ్యక్షుడి హోదాలో కురింజిజా ఆఫ్రికా సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లిన వెంటనే, ఆ దేశ ఆర్మీ జనరల్ నియోంబరే తిరుగుబాటు ప్రకటించారు. దీనిని అతని మద్దతు దారులు జోక్ గా అభివర్ణించినప్పటికీ, తరువాతి పరిణామాలు సైనిక తిరుగుబాటుగా స్పష్టమైంది. దీంతో సైన్యంలోని కురుంజిజా మద్దతు వర్గం నియోంబరే వర్గాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో నియోంబరే మద్దతు వర్గం ప్రభుత్వ రేడియో, టీవీ కాంప్లెక్సులపై దాడులకు దిగింది. ఈ క్రమంలో ఆఫ్రికా సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన బురుండీ అధ్యక్షుడు కురుంజిజా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News