: సీబీఐ వలలో విజయవాడ దూరదర్శన్ ఏడీ
విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో అవినీతి చేప సీబీఐ వలలో చిక్కుకుంది. ఈ కేంద్రంలో అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్న హనుమంతరావు రూ.1.5 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. టీవీ సీరియల్ బిల్లులు శాంక్షన్ చేయాలంటే లంచం ఇవ్వాల్సిందేనని ఏడీ హనుమంతరావు స్పష్టం చేయడంతో బాధితులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో, సీబీఐ అధికారులు ప్రణాళిక ప్రకారం వ్యవహరించి ఆ లంచగొండి ఏడీని అరెస్టు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.