: ఫేస్ బుక్ కాంట్రాక్టు ఉద్యోగులపై యాజమాన్యం కరుణ


ఫేస్ బుక్ యాజమాన్యం ఆ సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులపై కరుణ చూపింది. వేతనాల పెంపుతోపాటు ఇతర బెనిఫిట్స్ కూడా వారికి వర్తింపు చేస్తూ ఫేస్ బుక్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ బెనిఫిట్స్ అమెరికాలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు మాత్రమే వర్తించనున్నాయి. కనీస వేతనంగా గంటకు వెయ్యి రూపాయలు చెల్లించనున్నారు. అలాగే ఏడాదికి 15 రోజుల వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేస్తారు. డెలివరీ సమయంలో మహిళలకు రెండున్నర లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా అందజేయనున్నట్టు ఫేస్ బుక్ యాజమాన్యం తెలిపింది. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫేస్ బుక్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News