: కింగ్ ఖాన్ ట్విట్టర్ ఫోలోయర్స్ రికార్డు


బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కు ఫాలోయర్స్ అభిమానం వెల్లువెత్తుతోంది. సోషల్ మీడియాలో కింగ్ ఖాన్ కు అబిమానగణం దినదిన ప్రవర్ధమానమవుతోంది. ట్విట్టర్లో షారూఖ్ ఖాన్ ను అనుసరించే వారి సంఖ్య రికార్డు స్థాయిలో కోటీ 30 లక్షలకు చేరింది. ఈ విషయాన్ని ఆయన ఆధ్వర్యంలోని రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ తెలిపింది. పనిలోపనిగా షారూఖ్ కు అభినందనలు తెలిపింది. అభిమానుల ఆదరణ ఇలాగే ఉండాలని కోరింది. బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లను అధిగమించి షారూఖ్ సోషల్ మీడియాలో అభిమానులను అలరించడం విశేషం.

  • Loading...

More Telugu News