: క్షణాల్లో నవజీవన్ ఎక్స్ ప్రెస్ దోపిడీ దొంగలను పట్టేసిన ఏపీ పోలీస్


ఆంధ్రప్రదేశ్ పోలీసులు సత్తా చాటారు. నెల్లూరు జిల్లాలో నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో జరిగిన భారీ దోపిడీని పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం అలవలపాడు వద్ద దొంగలను అదుపులోకి తీసుకున్నారు. బంగారం కొనుగోలు నిమిత్తం నెల్లూరు వెళ్తున్న వ్యాపారుల నుంచి దుండగులు 82 లక్షల రూపాయలు దోచుకున్న సంగతి తెలిసిందే. దీనిపై కావలి పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేయగా, అప్రమత్తమైన పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి వారిని పట్టుకుని 82 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News