: కాంగ్రెస్ నేతల్లో భరోసా కల్పించేందుకే ఈ యాత్ర: కవిత
తెలంగాణలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భరోసాయాత్రపై టీఆర్ఎస్ ఎంపీ కవిత విమర్శలు గుప్పించారు. ఇది రైతుల కోసం చేస్తున్న భరోసా యాత్ర కాదని... కేవలం కాంగ్రెస్ నేతల్లో భరోసా కల్పించే యాత్ర అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఎక్కువ కాలం పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీనే అని... అలాంటిది, ఇప్పుడు రైతుల పేరుతో రాజకీయాలు చేయాలనుకోవడం రాహుల్ కు తగదని అన్నారు. తమకోసం ఎవరు పనిచేస్తున్నారు... ఎవరు ప్రచారాలకు పాల్పడుతున్నారు? అనే విషయం ప్రజలకు తెలుసని చెప్పారు.