: రైతుల అపోహలను బ్యాంకులు తీర్చితే ఎక్కడా సమస్యలు తలెత్తవు: మంత్రి ప్రత్తిపాటి


ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హైదరాబాదులోని సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రుణమాఫీ అంశంపై ఆయన పలు సందేహాలను నివృత్తి చేసేందుకు యత్నించారు. రైతుల అపోహలను బ్యాంకులు తీర్చితే ఎక్కడా సమస్యలు తలెత్తవని అభిప్రాయపడ్డారు. సాంకేతిక లోపాల కారణంగా కొందరు రైతుల రుణాలు మాఫీ కాలేదని, అలాంటివి పరిశీలిస్తున్నామని చెప్పారు. గ్రామాల వారీగా రుణమాఫీ లబ్ధిదారుల జాబితాలను ఆయా గ్రామసభల్లో ప్రదర్శించే ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఓటు ఉన్న ప్రతి ఒక్కరికీ రుణమాఫీ వర్తిస్తుందని ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News