: 88 ఏళ్ల తరువాత 'పెళ్లి ఫోటో' ముచ్చట తీర్చుకున్న జంట


వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రత్యేకమైన సంబరం. అందుకే పెళ్లినాటి ఫోటోలను చూసుకోవడం, పెళ్లి నాటి ముచ్చట్లను చెప్పుకోవడం అందరూ ఆస్వాదిస్తారు. చైనాకు చెందిన 101 ఏళ్ల వు కాంగాన్, 103 ఏళ్ల వు సోంగ్షికి 88 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వందేళ్లు దాటినా వారికి పెళ్లి నాటి ఫోటో ముచ్చట తీరలేదు. పెళ్లి ఫోటో లేదని వారు బాధపడేవారు. వారి పెళ్లి ఫోటో కొరత తీర్చేందుకు స్థానిక ఫోటో కంపెనీ ఒకటి ముందుకు వచ్చింది. ఫోటో కోసం వారిని నవదంపతుల్లా అలంకరించింది. చక్కగా ముస్తాబైన వు కాంగాన్, వు సోంగ్షి ఫోటోలకు పోజిచ్చారు. దీంతో 88 ఏళ్ల వారి పెళ్లి ఫోటో ముచ్చట ఇలా తీరింది. ఇప్పుడీ ఫోటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News