: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లను సద్వినియోగం చేసుకోండి: హరీష్ రావు


టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టీఎస్ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాలోని సంగారెడ్డి కలెక్టరేట్ లో ఈ కార్యక్రమాల ద్వారా 312 మంది కొత్త జంటలకు రూ. కోటి 59 లక్షల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఈ పథకాల ద్వారా రూ. 51 వేల ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 30 కోట్ల విలువైన 651 ఎకరాల సాగు భూమిని దళితులకు ఇచ్చిందని వెల్లడించారు.

  • Loading...

More Telugu News