: ఉత్సవాల్లో ఏనుగులను ఉపయోగించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం


పండుగలు, ఉత్సవాల సందర్భంగా ఏనుగులతో ఊరేగింపులు జరపడం చూస్తూనే ఉంటాం. తమిళనాడు, కేరళలాంటి రాష్ట్రాల్లో ఇవి మరీ ఎక్కువగా ఉంటాయి. వీటిపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఉత్సవాల సందర్భంగా ఊరేగింపుల్లో భాగంగా ఏనుగులను హింసించరాదని, వాటి ఆరోగ్యాన్ని సంరక్షించాలని ఏనుగుల యజమానులతో పాటు ఉత్సవ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేసింది. దీనికి విరుద్ధంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఉత్సవాల సమయంలో ఏనుగులను హింసిస్తున్నారంటూ... 'పెటా' తరపున ఓ కేసు దాఖలైంది. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News