: ఇద్దరు కీలక నేతలను బహిష్కరించిన డీఎంకే
పార్టీలో కీలక నేతలుగా ఎదిగిన ఇద్దరిపై డీఎంకే అధిష్ఠానం వేటు వేసింది. పార్టీలో వారికి అప్పజెప్పిన అన్ని పదవుల నుంచి తొలగించింది. పార్టీ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించినందుకే వీరిని తొలగించినట్టు డీఎంకే జనరల్ సెక్రటరీ బాహగన్ ఈరోజు ప్రకటించారు. "ఇంతకాలం పార్టీలో కీలక స్థాయుల్లో పనిచేసిన వి.కరుపాస్వామి పాండియన్, అనితా రాధాకృష్ణన్ లు క్రమశిక్షణను ఉల్లంఘించారు. అందువల్ల, వీరిద్దరినీ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం" అని బాహగన్ తెలిపారు. 2000లో పాండియన్, 2009లో అనితలు అన్నా డీఎంకే నుంచి బయటకు వచ్చి డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు.