: రాహుల్ శైలి చూస్తుంటే... కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటైనట్టున్నాయి: టీఆర్ఎస్ ఎంపీ సుమన్
తెలంగాణలో భరోసాయాత్ర చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రాహుల్ తెలంగాణలో పర్యటిస్తున్నారని ఆరోపించారు. ఆయన యాత్ర తెలంగాణకే ఎందుకు పరిమితమైందని... ఏపీలో ఎందుకు పర్యటించడం లేదని ప్రశ్నించారు. అవసరం లేకున్నా వేలాది ఎకరాల భూమిని రైతుల నుంచి చంద్రబాబు లాక్కొంటున్నారని... దానిపై రాహుల్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఆయన వ్యవహారశైలి చూస్తుంటే... కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటైనట్టు కనిపిస్తోందని అన్నారు. అమేథీలో వడగళ్ల వర్షంతో రైతులు నష్టపోతే పరామర్శించని రాహుల్ గాంధీ... తెలంగాణ రైతుల కోసం పర్యటిస్తుండటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.